దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ ప్రారంభించారు. సరోజిని నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తి స్థాయిలో మహిళ సిబ్బంది పనిచేయనున్నారు.ఈ డిపోకు సఖి డిపో అనే పేరు కూడా పెట్టారు. డిపో మెనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అందరూ కూడా మహిళలే. ఇందుకోసం మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించామని పేర్కొన్నారు. వీరిలో 89 మంది డ్రైవర్లు, 134 మంది కండక్టర్లు ఉన్నారని చెప్పారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలోనూ తమ హక్కులను పొందాలనే ఉద్దేశంతో ఈ డిపోను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు.
దేశంలో ఇప్పటికే చాలా డిపోల్లో మహిళలు బస్ కండక్టర్లుగా.. డిపోల్లో ఆఫీసు సిబ్బందిగా పని చేస్తున్నారు. ఇకపై డ్రైవర్లుగా కూడా మహిళలు తమ ప్రతిభను చాటుకునే అవకాశం వచ్చింది. ఢిల్లీలో ప్రారంభించిన సఖి డిపో కొత్త ట్రెండ్ సృష్టించే అవకాశం ఉంది. దేశంలో తొలిసారిగా మహిళా బస్ డిపో ప్రారంభించడం మంచిదే అయినప్పటికీ కూడా.. ప్రస్తుతం రవాణా రంగంలో పనిచేస్తున్న తమకు సరైన సౌకర్యాలు లేవని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులు మంత్రి ఎదుట నిరసన చేశారు